రేపటి నుంచి ప్రత్యక్ష ఆందోళన: ఆర్టీసీ జేఏసీ
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:42 AM
ఏపీఎస్ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23 నుంచి ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతున్నట్టు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది.
అమరావతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ఏపీఎస్ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23 నుంచి ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతున్నట్టు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. వివిధ డిమాండ్ల సాధన కోసం నెల 23, 24న రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల్లో ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జిలు ధరించి విధులకు హాజరవుతూ ధర్నాలు చేపడతారని, 28న విజయవాడలో రాష్ట్ర స్థాయి జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదర్‌రావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.