APSA Executive Committee: సీఎంను కలిసిన అప్సా కార్యవర్గం
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:20 AM
సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా)కు కొత్తగా ఎన్నికైన కార్యవర్గం సోమవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది.
కొత్త అధ్యక్షుడు రామకృష్ణకు చంద్రబాబు అభినందన
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా)కు కొత్తగా ఎన్నికైన కార్యవర్గం సోమవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది. అధ్యక్షుడు గొలిమి రామకృష్ణ సహా నూతన కార్యవర్గాన్ని సీఎం అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే, ప్రభుత్వం నిర్దేశించిన స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌కు పూర్తి స్థాయిలో సహకరిస్తామని సీఎంకు రామకృష్ణ తెలిపారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తామన్నారు. ఉద్యోగుల వివిధ సమస్యల పరిష్కారానికి విజ్ఞాపన పత్రాన్ని సీఎంకు అందజేశారు.