Share News

గ్రూప్‌-1 ఫలితాలు సిద్ధం.. నేడు విడుదల..!

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:34 AM

గ్రూప్‌-1 ఫలితాల కోసం అభ్యర్థుల ఎదురుచూపులకు తెరపడనుంది. బుధవారం గ్రూప్‌-2 ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఫలితాలనూ ప్రకటించేందుకు సిద్ధమైంది..

గ్రూప్‌-1 ఫలితాలు సిద్ధం.. నేడు విడుదల..!

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 ఫలితాల కోసం అభ్యర్థుల ఎదురుచూపులకు తెరపడనుంది. బుధవారం గ్రూప్‌-2 ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఫలితాలనూ ప్రకటించేందుకు సిద్ధమైంది. బుధవారం హైకోర్టులో జరిగిన విచారణలో ఫలితాలపై ముందుకెళ్లొచ్చనే ఆదేశాలు వచ్చాయి. దీంతో ఫలితాలు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాల ఉత్తర్వులు కమిషన్‌కు చేరడంతో ఆలస్యం జరిగింది. ఆ ఉత్తర్వులు గురువారం కమిషన్‌కు చేరినట్లు తెలిసింది. దీంతో వెంటనే ఫలితాల విడుదలకు కమిషన్‌ అధికారులు సిద్ధమయ్యారు. కానీ మరొకసారి మొత్తం ప్రక్రియను పరిశీలించాలని అంతర్గతంగా నిర్ణయించారు. దీంతో ఫలితాలు శుక్రవారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - Jan 30 , 2026 | 05:34 AM