డీవైఈవోల ఎంపికకు బ్రేక్?
ABN , Publish Date - Feb 20 , 2026 | 04:30 AM
ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ పోస్టుల ఫలితాలకు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది.
మహిళా రిజర్వేషన్ అంశంపై స్టేటస్ కో విధించిన హైకోర్టు
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ పోస్టుల ఫలితాలకు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ అంశంపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం రెండు వారాలపాటు స్టేట్‌సకో విధించింది. దీంతో ఫలితాలు ప్రకటించినా తుది ఎంపికపై ముందుకు వెళ్లలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 38 పోస్టులకు 38 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తూ ఏపీపీఎస్సీ ఇటీవల ఫలితాలను వెలువరించింది. వారికి ఈనెల 24న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహించి, సర్టిఫికెట్లు పరిశీలించి ఉద్యోగాలకు ఎంపిక చేయాల్సి ఉంది. కాగా, 38 పోస్టుల్లో 16 మంది మహిళలను ఎంపిక చేశారని, ఇది మహిళా కోటాను దాటిపోయిందని కొందరు కోర్టుకు వెళ్లారు. వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తాత్కాలికంగా స్టేట్‌సకో విధించింది.