డిగ్రీ లెక్చరర్ ఫలితాలు విడుదల
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:31 AM
తెలుగు, బయోటెక్నాలజీ సబ్జెక్టుల డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలను ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది.
అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): తెలుగు, బయోటెక్నాలజీ సబ్జెక్టుల డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలను ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. తెలుగు అధ్యాపక పోస్టులకు ఏడుగురు, బయోటెక్నాలజీ పోస్టులకు నలుగురు ఎంపికయ్యారు. 2023లో ఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీకాగా ఏపీపీఎస్సీ ఇప్పుడు పూర్తి చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.