బయో గ్యాస్ ప్రాజెక్టుకు ఆమోదం
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:59 PM
సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం అమరావతిలోని సచివాలయంలో జరిగిన 1394వ(57వ) కేబినేట్‌లో సమావేశంలో జిల్లాలో కీలక ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
అలగనూరులో రూ. 168.56 కోట్లతో
600మందికి ఉపాధి అవకాశం
2028 నుంచి సీఎనజీ గ్యాస్ సరఫరా
సాయి బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి
నంద్యాల, సెప్టెంబరు23(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం అమరావతిలోని సచివాలయంలో జరిగిన 1394వ(57వ) కేబినేట్‌లో సమావేశంలో జిల్లాలో కీలక ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. తద్వారా ఎంతో ప్రతిష్టాత్మకమైన సీఎనజీ బయోగ్యాస్ ప్రాజెక్టు జిల్లాలో ఏర్పాటు కావడంతో పాటు సుమారు 600మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించినట్లైంది.
ఫ రూ. 168.56 కోట్లతో...
జిల్లాలోని మిడ్తూరు మండలం అలగనూరు గ్రామంలోని సర్వే నెంబర్ 399 పరిధిలోని 30 ఎకరాల్లో సాయి బయోఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ రోజుకు 24 టన్నులు సీఎనజీ బయోగ్యాస్ ఉత్పత్తి చేసే విధంగా రూ. 168.56 కోట్లతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి తాజాగా కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే సమీప ప్రాంతాల్లోని సుమారు 600మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఇదిలా ఉండగా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 30 ఎకరాలు భూమి అంతా ఈ సంస్థకు చెందినదే కావడంతో ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగే అవకాశం ఉంది. 2028 నుంచి ప్రాజెక్టు నుంచి సీఎనజీ బయోగ్యాస్ సరఫరా కానుందని తెలిసింది.