Share News

ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:58 AM

2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవార్డులకు అర్హులైన జర్నలిస్టుల నుంచి ఈమేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్‌ విశ్వనాథన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు   దరఖాస్తుల ఆహ్వానం
LOGO

విజయవాడ (కలెక్టరేట్‌), సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవార్డులకు అర్హులైన జర్నలిస్టుల నుంచి ఈమేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్‌ విశ్వనాథన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా తెలిపిన విధంగా సెప్టెంబరు 28లోగా ఉన్న గడువును అక్టోబరు 5వ తేదీకి పొడిగించామని పేర్కొన్నారు. అర్హత కలిగిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను అక్టోబరు 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా డైరెక్టర్‌, సమాచార పౌరసంబంధాల శాఖ, రెండో అంతస్తు, ఎన్టీఆర్‌ పరిపాలన భవనం, పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌, విజయవాడ-13 చిరునామాకు పంపాలని కోరారు.

Updated Date - Sep 28 , 2026 | 06:06 AM