Share News

ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - May 02 , 2026 | 10:56 PM

ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో ప్రవే శానికై గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకునేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా సెక్రెటరీ సమీకృత గిరిజ నాభివృద్ధి సంస్థ, ప్రాజెక్టు అధికారి పీవీఎస్‌ నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

   ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

శ్రీశైలం, మే 2(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో ప్రవే శానికై గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకునేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా సెక్రెటరీ సమీకృత గిరిజ నాభివృద్ధి సంస్థ, ప్రాజెక్టు అధికారి పీవీఎస్‌ నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహానంది మండలం నెరవాడలోని కళా శాలలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన బాలికలకు 40 సీట్లు ఉండగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులో 36 ఎస్టీ విద్యార్థినులకు, 4 సీట్లు ఇతర రిజర్వేషన్లకు అవకాశం కల్పిస్తూ దరఖాస్తులను ఆహ్వా నిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల గిరిజన గురుకుల కళాశాలలో 5 సీట్లు, ఏ అండ్‌ టీ గ్రూపులో ఉన్న 20 సీట్లను ఉమ్మడి కర్నూలు జిల్లా గిరిజన విద్యార్థినులకు అవ కాశం కల్పిస్తున్నామని వివరించారు. శ్రీశైలం బాలుర కళాశాల నుంచి ఉమ్మడి కజిల్లాలకు చెందిన బాలురకు ప్రతి గ్రూపులో 25 సీట్లకుగాను 21 సీట్లు గిరిజన బాలురకు అవకాశం ఇవ్వగా మిగిలిన 4 సీట్లు ఇతర రిజర్వేషన విద్యార్థుల నుంచి ప్రవేశ దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు చెప్పారు. కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల వారికి కూడా ప్రతి గ్రూపులో ఎస్టీ వారికి 5 సీట్లు కేటాయించగా, ఏ అండ్‌ టీ కోర్సులో 20 సీట్లకు కేవలం గిరిజన బాలుర విద్యార్థులు మాత్రమే అర్హులని పీవో స్పష్టంచేశారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆనలైన ద్వార దర ఖాస్తులు సమర్పించుటకు ఆఖరు తేదీగా ప్రకటించారు. 26న జరిగే కౌన్సెలింగ్‌కు దరఖాస్తుదారులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. వివరాలకు బాలురు: 94909 57268, బాలికలు 94909 57266, నంబర్లలో సంప్రదించవలసిందిగా కోరారు.

Updated Date - May 02 , 2026 | 10:56 PM