Share News

ఉద్యోగుల హక్కుల సాధనకు కార్యాచరణ

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:55 AM

ఉద్యోగులకు చట్టపరంగా రావాల్సిన హక్కులను దశలవారీగా సాధించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఏపీఎన్జీజీవో రాష్ట్ర నూతన అధ్యక్షుడు విద్యాసాగర్‌...

ఉద్యోగుల హక్కుల సాధనకు కార్యాచరణ

  • ఏపీఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌

విజయవాడ (గాంధీనగర్‌), ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు చట్టపరంగా రావాల్సిన హక్కులను దశలవారీగా సాధించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఏపీఎన్జీజీవో రాష్ట్ర నూతన అధ్యక్షుడు విద్యాసాగర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత, సీపీఎస్‌ ఉద్యోగులకు న్యాయమైన పింఛన్‌ విధానం, మెరుగైన వైద్య సేవలు, పీఆర్సీ నియామకం, ఐఆర్‌ మంజూరు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నూతన రాష్ట్ర కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా డీవీ రమణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా కిలారు జగదీశ్వరరావు, సహాధ్యక్షులుగా వి.దస్తగిరి, ఉపాధ్యక్షులుగా ఎల్‌.బొంజయ్య, ఆర్‌ఎస్‌ హరినాథ్‌, షేక్‌ జానీపాషా, పి.కిరణ్‌ కుమార్‌, ఎస్‌కే నాగుర్‌ షరీఫ్‌, వై.ప్రసాద్‌, ఎస్‌.రాజశేఖర్‌, ఆర్‌.రవిశంకర్‌, ఎం.సత్యనారాయణ,రాజు, బి.వెంకటేశ్‌బాబు, ఆర్‌.వేణుగోపాల్‌, టి.ఏసుబాబు, కార్యదర్శులుగా ఎల్‌.రజనీష్ బాబు, ఎస్‌బీబీ రాంప్రసాద్‌, ఎ.రంజిత్‌కమార్‌ నాయుడు, పి.శివప్రసాద్‌, వి.సుబ్బారెడ్డి, కోశాధికారిగా ఎన్‌.భారతీ ప్రసాద్‌, మహిళా విభాగం కార్యదర్శిగా ఎం.సరస్వతి, ప్రచార కార్యదర్శిగా బి.జానకిలకు స్థానం లభించిందని వివరించారు.

Updated Date - Feb 10 , 2026 | 04:57 AM