ఇక ఉద్యమం తీవ్రతరం
ABN , Publish Date - Aug 17 , 2026 | 04:57 AM
ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఏపీజేఏసీ అమరావతి పిలుపునిచ్చింది. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో..
28న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు: ఏపీజేఏసీ
విజయవాడ అర్బన్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఏపీజేఏసీ అమరావతి పిలుపునిచ్చింది. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్ ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని కమిటీ నిర్ణయించిందని, ఇందులో భాగంగా ఈనెల 28న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. అదేరోజు ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్‌ను ప్రకటించి, నిర్ణయించిన తీర్మానాల నోటీసును సీఎస్‌కు అందజేయనున్నట్టు ఉద్యమ కమిటీ చైర్మన్ టీవీ ఫణిపేర్రాజు తెలిపారు.