నెలవారీ సెటిల్‌మెంట్, బిల్లింగ్ తప్పనిసరి!
ABN , Publish Date - Feb 07 , 2026 | 05:43 AM
సోలార్ రూఫ్‌టాప్ ప్రొస్యూమర్లు (ఉత్పత్తి మరియు వినియోగదారులు) ఉత్పత్తి చేసి విద్యుత్తు యూనిట్ల సెటిల్‌మెంట్....
డిస్కమ్‌లకు ఏపీఈఆర్‌సీ ఆదేశాలు
అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): సోలార్ రూఫ్‌టాప్ ప్రొస్యూమర్లు (ఉత్పత్తి మరియు వినియోగదారులు) ఉత్పత్తి చేసి విద్యుత్తు యూనిట్ల సెటిల్‌మెంట్, వినియోగించిన విద్యుత్తు బిల్లింగ్‌ను నెలవారీగా అమలు చేయాలని ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి డిస్కమ్‌లను ఆదేశించింది. 2023లో అమల్లోకి వచ్చిన గ్రిడ్ ఇంటరాక్టివ్ సోలార్ రూఫ్‌టాప్ ఫొటోవోల్టాయిక్ సిస్టమ్ నిబంధనలు, 2025లో చేసిన మొదటి సవరణకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ప్రతినెలా విద్యుత్తు వినియోగం, మిగులు విద్యుత్తును గ్రిడ్‌కు ఎగుమతి చేసిన యూనిట్ల లెక్కలను తీయాలని, గ్రిడ్‌కు అదనంగా పంపిన విద్యుత్తుకు సంబంధించిన చెల్లింపులను వినియోగదారులకు ఎలకా్ట్రనిక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా చెల్లించాలని స్పష్టం చేసింది. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన ఈ నేపథ్యంలో ఈఆర్సీ... ఈ ఆదేశాలు జారీ చేసింది.