Share News

మోదీ మోసాన్ని ప్రజలు నిలదీయాలి: మస్తాన్‌వలి

ABN , Publish Date - May 18 , 2026 | 06:28 AM

మతోన్మాద పిచ్చిలో మునిగితేలుతారో.. ప్రధాని మోదీ చేస్తున్న మోసాన్ని నిలదీస్తారో ప్రజలు తేల్చుకోవాలని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి పిలుపునిచ్చారు.

మోదీ మోసాన్ని ప్రజలు నిలదీయాలి: మస్తాన్‌వలి

అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): మతోన్మాద పిచ్చిలో మునిగితేలుతారో.. ప్రధాని మోదీ చేస్తున్న మోసాన్ని నిలదీస్తారో ప్రజలు తేల్చుకోవాలని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి పిలుపునిచ్చారు. విజయవాడలో ఆదివారం ఆయన మాట్లాడారు. ప్రధాని దేశ ప్రజలను అవస్థల పాల్జేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచబోమని, దేశ ప్రజలను ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ చెప్పుకొచ్చిన ఆయన.. ఎన్నికలు అయిపోగానే ధరలను పెంచేశారని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు భయపడి, రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు విదేశాలతో కుమ్మక్కయ్యారంటూ విమర్శించే మోదీ.. ట్రంప్‌కెందుకు భయపడుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - May 18 , 2026 | 06:28 AM