NRI Property Expo: రేపు అపర్ణ ‘ఎన్‌ఆర్‌ఐ ప్రాపర్టీ ఎక్స్‌పో’
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:54 AM
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చే ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) కోసం విజయవాడలో ఈ నెల 11న ‘ఎన్‌ఆర్‌ఐ ప్రాపర్టీ ఎక్స్‌పో’ నిర్వహించనున్నట్టు...
సంక్రాంతికి వచ్చే ఎన్‌ఆర్‌ఐల కోసం విజయవాడలో ఏర్పాటు
పశ్చిమ, ఉత్తర హైదరాబాద్‌ల్లోని ప్రాజెక్టుల ప్రదర్శన
విజయవాడ, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చే ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) కోసం విజయవాడలో ఈ నెల 11న ‘ఎన్‌ఆర్‌ఐ ప్రాపర్టీ ఎక్స్‌పో’ నిర్వహించనున్నట్టు అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ తెలిపింది. ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విజయవాడ ఎంజీ రోడ్‌లోని లెమన్ ట్రీ హోటల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించింది. వీటిలో ముఖ్యంగా హైదరాబాద్ ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని తమ ప్రాజెక్టుల గురించి వివరిస్తామని తెలిపింది. హైదరాబాద్‌ను నివాస గమ్యస్థానంగా, దీర్ఘకాలిక రియల్ ఎస్టేట్ పెట్టుబడుల కేంద్రంగా భావించే ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేకంగా ఈ ఎక్స్‌పో నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. పశ్చిమ, ఉత్తర హైదరాబాద్‌ల్లో ప్రీమియం, మధ్య స్థాయి గేటెడ్ కమ్యూనిటీల పట్ల ఎన్‌ఆర్‌ఐలకు పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపింది. ఇందులో ‘రెడీ టు మూవ్’, అండర్ కన్‌స్ట్రక్షన్ వంటి రెండు రకాల ప్రాజెక్టులు ఉన్నాయని వెల్లడించింది. 123 ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర టౌన్‌షిప్ ‘అపర్ణ డెక్కన్ టౌన్’ కూడా ఇందులో ఉందని తెలిపింది. హైరైజ్ అపార్ట్‌మెంట్లు, ప్రీమియం బంగ్లాలు, హై స్ట్రీట్ రిటెయిల్ జోన్లు, మాల్, మల్టీప్లెక్సులు ఈ టౌన్‌షి్‌ప ప్రత్యేకతలని వివరించింది.