బాధితులకు సత్వర పరిహారం అందాలి
ABN , Publish Date - May 07 , 2026 | 04:06 AM
మానవ అక్రమ రవాణా బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణా బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మానవ అక్రమ రవాణా బాధితులకు నష్టపరిహారం చెల్లింపులపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం వర్చువల్‌గా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శైలజ మాట్లాడుతూ బాధితులకు న్యాయం అందాలంటే పరిహారం చెల్లింపులో ఆలస్యం ఉండకూడదన్నారు. పరిహారం చెల్లింపులో ఎదురవుతున్న సమస్యలు, అర్హత నిర్ధారణలో ఉన్న సవాళ్లు, నిధుల విడుదలలో అడ్డంకులను స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతినిధులు వివరించారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారుల నుంచి పెండింగ్ కేసులు, బడ్జెట్ అవసరాలు, ప్రక్రియలో ఉన్న సమస్యలను సేకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అడ్వైజరీ డైరెక్టర్ సూయజ్ మాట్లాడుతూ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తే బాధితులకు సత్వర న్యాయం చేయగలమన్నారు.