మల్లిగాని చెరువుకు పోలవరం నీరు
ABN , Publish Date - Jun 18 , 2026 | 04:26 AM
పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి కృష్ణా- ఏలూరు కాలువ ద్వారా మల్లిగాని చెరువుకు గోదావరి జలాలు తరలించేందుకు రూ.40.51 కోట్ల అంచనా వ్యయానికి జల వనరుల శాఖ..
పాలనామోదం తెలిపిన జల వనరుల శాఖ
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి కృష్ణా- ఏలూరు కాలువ ద్వారా మల్లిగాని చెరువుకు గోదావరి జలాలు తరలించేందుకు రూ.40.51 కోట్ల అంచనా వ్యయానికి జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఆమోదం తెలిపారు. ఈ వ్యయాన్ని సాస్కి-పోలవరం కుడి ప్రధాన కాలువ నిధుల నుంచి ఖర్చు చేయాలని బుధవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పథకం కోసం సేకరించే భూమి, ఇసుక ధరలను జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయించాలన్నారు. రెవెన్యూ అధికారులు భూసేకరణను చేపట్టాలన్నారు. సీనరేజి చార్జీలను జిల్లా మైనింగ్ అధికారులు నిర్ధారిస్తారన్నారు.