Share News

‘తాలీం-ఏ-హునర్‌’కు భారీ స్పందన

ABN , Publish Date - May 09 , 2026 | 04:51 AM

దేశ చరిత్రలో తొలిసారిగా ఏపీ వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన తాలీం-ఏ-హునర్‌ (వక్ఫ్‌ ఎడ్యుకేషన్‌ మిషన్‌) కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని..

‘తాలీం-ఏ-హునర్‌’కు భారీ స్పందన

  • ఏపీ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): దేశ చరిత్రలో తొలిసారిగా ఏపీ వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన తాలీం-ఏ-హునర్‌ (వక్ఫ్‌ ఎడ్యుకేషన్‌ మిషన్‌) కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన మూడు రోజుల్లోనే 3వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ప్రతిభావంతులైన ముస్లిం విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్‌ కార్పొరేట్‌ ఇంటర్మీడియట్‌ విద్యతో పాటు ఐఐటీ, జేఈఈ, నీట్‌, ఎప్‌ సెట్‌ కోచింగ్‌ అందించే ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద ముస్లిం విద్యార్థులు కూడా డాక్టర్‌, ఇంజనీర్‌, సైంటిస్ట్‌లు కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే టాలెంట్‌ టెస్ట్‌ ద్వారా మెరిట్‌ ఆధారంగా 250 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నామని చెప్పారు. బాలికలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మే 12 అని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల కోసం https://apwaqfboard.e I91.com/REH/ ను సందర్శించాలని సూచించారు.

Updated Date - May 09 , 2026 | 04:54 AM