Share News

పట్టణాభివృద్ధికి 30 రోజుల ప్రణాళిక

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:52 AM

పట్టణాల సమగ్రాభివృద్ధికి 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను మున్సిపాలిటీల్లో అధికారులు కచ్చితంగా అమలు చేయాలని..

పట్టణాభివృద్ధికి 30 రోజుల ప్రణాళిక

  • ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): పట్టణాల సమగ్రాభివృద్ధికి 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను మున్సిపాలిటీల్లో అధికారులు కచ్చితంగా అమలు చేయాలని మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌కుమార్‌ చెప్పారు. విజయవాడలో ‘అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కెపాసిటీ బిల్డింగ్‌’ రెండు రోజుల వర్క్‌షాపులో బుధవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి మున్సిపాలిటీ కనీసం ఒక లాభదాయకమైన ప్రాజెక్టును, పెద్ద కార్పొరేషన్లు ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్టులను ప్రతిపాదించాలన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 04:52 AM