వర్సిటీ పోస్టులకు గడువు పొడిగింపు
ABN , Publish Date - Jun 09 , 2026 | 05:29 AM
విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఉన్నత విద్య కమిషనర్ భరత్ గుప్తా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
15 వరకు ఆన్‌లైన్.. 22 వరకు ఆఫ్‌లైన్ దరఖాస్తులు
ఇప్పటికే ఒక్క పోస్టుకు 29,179 మంది పోటీ!
అమరావతి, జూన్ 8(ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఉన్నత విద్య కమిషనర్ భరత్ గుప్తా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ప్రకచించిన షెడ్యూలు ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ గడువు సోమవారంతో ముగిసింది. అభ్యర్థుల వినతుల మేరకు ఈ నెల 15 వరకు పొడిగించారు. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తుల హార్డ్ కాపీలను యూనివర్సిటీలకు పంపాలి. అందుకోసం 22 వరకు సమయం పొడిగించారు. అనంతరం ఈనెల 29న అర్హులు, అనర్హుల జాబితాలు ప్రదర్శిస్తారు. వాటిపై జూలై 6 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 7న తుది అర్హుల జాబితాలు ప్రకటిస్తారు. కా గా, ఇప్పటివరకూ 1,60,314 దరఖాస్తులు అందాయి. ఒక్క పోస్టుకు కనీ సం 29,179 మంది దరఖాస్తు చేసుకున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 1,42,683, అసోసియేట్ 9187, ప్రొఫెసర్ పోస్టులకు 1417 దరఖాస్తు లు వచ్చాయి. ఆర్జీయూకేటీల్లో లెక్చరర్ పోస్టులకు 9521 దరఖాస్తులు అందాయి.