Share News

ట్రెజరీస్‌, అకౌంట్స్‌ శాఖ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కృషి

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:40 AM

ట్రెజరీస్‌, అకౌంట్స్‌ శాఖల ఉద్యోగుల హ క్కుల పరిరక్షణకు కృషిచేస్తానని రాష్ట్ర ట్రెజరీస్‌, అకౌంట్స్‌ గెజిటెడ్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.రాజకుమార్‌ అన్నారు.

ట్రెజరీస్‌, అకౌంట్స్‌ శాఖ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కృషి

  • సంఘ నూతన అధ్యక్షుడు రాజకుమార్‌

విజయవాడ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : ట్రెజరీస్‌, అకౌంట్స్‌ శాఖల ఉద్యోగుల హ క్కుల పరిరక్షణకు కృషిచేస్తానని రాష్ట్ర ట్రెజరీస్‌, అకౌంట్స్‌ గెజిటెడ్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.రాజకుమార్‌ అన్నారు. రాష్ట్ర ట్రెజరీస్‌, అకౌంట్స్‌ గెజిటెడ్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్రస్థాయి కార్యవర్గ ఎన్నికలు ఆదివారం విజయవాడలో జరిగాయి. నూతన అధ్యక్షుడిగా కె.రాజకుమార్‌, ప్రధాన కార్యదర్శిగా డీజే సంపత్‌రావు ఎన్నికయ్యారు. అనంతరం రాజకుమార్‌, సంపత్‌రావు మా ట్లాడుతూ ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రెజరీ, అకౌంట్స్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 04:41 AM