Share News

అవసరమైతే స్లీపర్‌ బస్సులు రద్దు: మంత్రి మండిపల్లి

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:08 AM

రాబోయే కాలంలో రాష్ట్రంలో అవసరమైతే స్లీపర్‌ బస్సులు రద్దు చేస్తామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

అవసరమైతే స్లీపర్‌ బస్సులు రద్దు: మంత్రి మండిపల్లి

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): రాబోయే కాలంలో రాష్ట్రంలో అవసరమైతే స్లీపర్‌ బస్సులు రద్దు చేస్తామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. 300 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే ప్రతి ప్రైవేటు బస్సు సర్వీసులోనూ ఇద్దరు డ్రైవర్లు కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. రాత్రిళ్లు ప్రయాణించే బస్సుల్లో డ్రైవర్‌ నిద్రపోవడానికి ఒక సీటు కేటాయించాల్సిందేనన్నారు. ప్రమాదాల నివారణే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై స్పీడ్‌ గన్‌లు ఏర్పాటు చేస్తామని, బస్సుల్లో సీట్లపై విధించే పన్నును తగ్గించేలా త్వరలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 04:08 AM