Share News

పలువురు పీఆర్‌ అధికారుల బదిలీ

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:58 AM

రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ అధికారులను బదిలీ చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

పలువురు పీఆర్‌ అధికారుల బదిలీ

అమరావతి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ అధికారులను బదిలీ చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల 73 మంది డివిజనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్ల(డీడీఓ)కు పంచాయతీరాజ్‌ శాఖ జడ్పీ సీఈఓలుగా పదోన్నతులు కల్పించింది. ఈ క్రమంలో పలువురికి పోస్టింగ్‌లు ఇవ్వడంతో అక్కడ పనిచేస్త్తున్న సిబ్బంది ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేశారు. తిరుపతి డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న సీవీ శ్రీనివాస ప్రసాద్‌ను నెల్లూరు డ్వామా పీడీగాను, అక్కడ పనిచేస్తున్న గంగాభవానీని తిరుపతి డివిజనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌గాను నియమించారు. ఎస్‌ఆర్‌డీఎస్‌ మెంబర్‌ సెక్రటరీగా పనిచేసి, వెయిటింగ్‌లో ఉన్న డీడీఓ మద్దిలేటిని తిరుపతి డ్వామా పీడీగా నియమించారు. గుంతకల్‌ డీడీఓ పి.విజయలక్ష్మిని అనంతపురం జడ్పీ సీఈఓగాను, కడప డిప్యూటీ సీఈఓగా ఉన్న సి.సుబ్రమణ్యంను సీఈఓగా నియమిస్తూ ఆదేశాలిచ్చారు. ఇటీవల పదోన్నతి పొంది, పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న ఇ.నాగలక్ష్మిని విజయనగరం జిల్లా స్వర్ణ గ్రామ/వార్డు అధికారిగా నియమించారు.

Updated Date - Apr 18 , 2026 | 03:58 AM