Share News

ఏపీటీడీసీ 50 ఏళ్ల వేడుకలకు లోగో డిజైన్‌ పోటీలకు ఆహ్వానం

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:30 AM

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) స్థాపించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఫిబ్రవరి 18వ తేదీ నుంచి గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి.

ఏపీటీడీసీ 50 ఏళ్ల వేడుకలకు లోగో డిజైన్‌ పోటీలకు ఆహ్వానం

విజయవాడ కల్చరల్‌, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) స్థాపించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఫిబ్రవరి 18వ తేదీ నుంచి గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. వేడుకల కోసం ప్రత్యేకంగా రూపొందించే ‘అ్కఖీఈఇః50’ లోగో డిజైన్ల కోసం ప్రతిభావంతులైన రూపకర్తల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పర్యాటక ఆపరేషన్స్‌ ఈడీ ఎ.ఎల్‌.పద్మావతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక వైభవాన్ని చాటి చెప్పేలా 50 ఏళ్ల వేడుకల లోగో ఉండాలన్నారు. నిపుణుల కమిటీ ద్వారా ఎంపికైన ఉత్తమ లోగోకు రూ.20 వేల నగదు పారితోషకంతో పాటు అధికారిక సత్కారం ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు తమ డిజైన్లను ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు gmmktg@aptdc.in,jayahobharathiyam@gmail.comకు పంపవలసి ఉంటుందని తెలిపారు. స్వర్ణోత్సవ వేడుకలను రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ప్రతి నెల ఒక వేదిక చొప్పున నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు.

Updated Date - Feb 12 , 2026 | 01:30 AM