Chief Secretary Vijay Anand: విద్యుత్ నష్టాలను తగ్గించాం
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:07 AM
విద్యుత్ సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించడంతో దేశంలోనే ఏపీ నంబర్‌వన్‌గా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
విద్యుత్ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణలో సీఎస్
అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): విద్యుత్ సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించడంతో దేశంలోనే ఏపీ నంబర్‌వన్‌గా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు. విద్యుత్ ఉద్యోగుల డైరీని బుధవారం ఆయన విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు సుమారు 9.6 శాతానికి తగ్గగా, ట్రాన్స్‌కో నష్టాలు 2.6 శాతానికి తగ్గాయన్నారు. జెన్కో ఎండీ నాగలక్ష్మి, ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ శివశంకర్, సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.