యూడీఏ నిధుల్లో పంచాయతీలకు వాటా
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:23 AM
పట్టణాభివృద్ధి అథారిటీల ద్వారా వసూలు చేస్తున్న ఫీజుల ఆదాయంలో గ్రామ పంచాయతీలకు వాటా ఇవ్వాలని, దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో చర్చించి
ఉపముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయిస్తాం: మంత్రి నారాయణ
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): పట్టణాభివృద్ధి అథారిటీల ద్వారా వసూలు చేస్తున్న ఫీజుల ఆదాయంలో గ్రామ పంచాయతీలకు వాటా ఇవ్వాలని, దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సోమవారం మున్సిపల్, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టణాభివృద్ధి అథారిటీల పరిధిలో ఉన్న పంచాయతీల్లో వివిధ రకాల అనుమతుల కోసం మున్సిపల్ శాఖ వసూలు చేసే నిధులను గ్రామ పంచాయతీలకు ఏ రకంగా ఖర్చు పెట్టాలనే దానిపై నిర్ధిష్ట నిబంధనలు లేవన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి గ్రామాల నిధులను ఆయా గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా నిర్ణయం తీసుకుంటామన్నారు.