Share News

త్వరలో పశు జనరిక్‌ ఔషధ కేంద్రాలు: అచ్చెన్న

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:05 AM

రాష్ట్రవ్యాప్తంగా పశు జనరిక్‌ ఔషధ విక్రయ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.

త్వరలో పశు జనరిక్‌ ఔషధ కేంద్రాలు: అచ్చెన్న

అమరావతి, ఫిబ్రవరి18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పశు జనరిక్‌ ఔషధ విక్రయ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. పశుపోషకులకు సబ్సిడీపై మందులు పంపిణీ చేసేలా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తొలి దశలో 150 పశు జనరిక్‌ ఔషధ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం తెలిపారు. గొర్రెల పెంపకం సహకార సంఘాల ద్వారా ఈ ఔషధ విక్రయ కేంద్రాలను పశువైద్యశాలల ఆవరణలో నిర్వహిస్తామని, మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

మార్కెట్‌ యార్డుల ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాలు

రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెలాఖరులోగా ఉచిత పశువైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడానికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందుకోసం 15 జిల్లాలకు రూ.50వేలు చొప్పున, 11 జిల్లాలకు రూ.30 వేలు చొప్పున నిధులు ఖర్చు చేయడానికి అనుమతిస్తూ మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ విజయసునీత ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Feb 19 , 2026 | 04:06 AM