Share News

రూ.808 కోట్లతో పురాతన ఆలయాలకు పూర్వ వైభవం

ABN , Publish Date - Jul 06 , 2026 | 05:39 AM

రాష్ట్ర వ్యాప్తంగా రూ.808 కోట్లు ఖర్చు చేసి 684 పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురానున్నట్లు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.

రూ.808 కోట్లతో పురాతన ఆలయాలకు పూర్వ వైభవం

  • రాష్ట్రంలో ఐదువేల శ్రీవాణి ఆలయాల నిర్మాణం

  • దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

చేజర్ల, జూలై 5(ఆంఽధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా రూ.808 కోట్లు ఖర్చు చేసి 684 పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురానున్నట్లు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు, చేజర,్ల చిత్తలూరు గ్రామాల్లో శిఽథిలావస్థలో ఉన్న ఆలయాల పునఃనిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. రూ.5.50 కోట్లతో ఈ ఆలయాలను పునరుద్దరించనున్నారు. అనంతరం చిత్తలూరులో ఆనం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్యంలో రాష్ట్రంలో ఆఽధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రభుత్వం ఆత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మూడేళ్లలో ఐదువేల శ్రీవాణి ఆలయాల నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని మంత్రి తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి తీరాన ఉన్న ఆలయాల పునః నిర్మాణాలు, మరమ్మతు పనులు వేగంగా చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు.

Updated Date - Jul 06 , 2026 | 05:40 AM