Share News

మున్సిపల్‌ రోడ్లపై శాస్త్రీయ లేన్‌ మార్కింగ్‌లు

ABN , Publish Date - May 21 , 2026 | 04:09 AM

రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ రహదారులపై స్టాండర్డ్‌ లేన్‌ మార్కింగ్‌లు, కర్బ్‌ పెయింటింగ్‌లు, శాస్త్రీయ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మున్సిపల్‌ రోడ్లపై శాస్త్రీయ లేన్‌ మార్కింగ్‌లు

  • అన్నీ పట్టణాల్లో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు

  • రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు మున్సిపల్‌శాఖ ఆదేశాలు

అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ రహదారులపై స్టాండర్డ్‌ లేన్‌ మార్కింగ్‌లు, కర్బ్‌ పెయింటింగ్‌లు, శాస్త్రీయ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మున్సిపల్‌శాఖ మంగళవారం సీడీఎంఏ, పబ్లిక్‌హెల్త్‌ అధికారులకు సమగ్ర మార్గదర్శకాలు జారీచేసింది. మున్సిపల్‌ సాధారణ నిధులు, రోడ్ల నిర్వహణ గ్రాంట్లతో వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని మున్సిపల్‌ రోడ్లు ఆధునిక పట్టణ రవాణా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, ట్రాఫిక్‌ క్రమశిక్షణ, పాదచారుల భద్రత, అంతర్జాతీయ స్థాయి పట్టణ మౌలిక వసతుల లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. అన్నీ పట్టణ స్థానికసంస్థల్లో స్టాండర్డ్‌ సెంటర్‌లైన్‌, సైడ్‌లైన్‌ మార్కింగ్‌లు, ఎడ్జ్‌లైన్లు, స్టాప్‌లైన్లు, జీబ్రా క్రాసింగ్‌లు, బ్లాక్‌ అండ్‌ యెల్లో కర్బ్‌ పెయింటింగ్‌లు, తప్పనిసరి, హెచ్చరిక, సమాచార ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, పాఠశాలలు, ఆసుపత్రులు, జంక్షన్‌లు, మార్కెట్‌ ప్రాంతాల వద్ద భద్రతా చర్యలు, మార్కింగ్‌ పనులూ చేపట్టాలని, దీనికి ముందుగా చిన్నపాటి రోడ్డు లోపాల సవరణ చేపట్టనున్నారు. ఈ పనుల అమలుకు సంబంధించి ప్రమాణాల మేరకు ప్రత్యేక స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ కూడా జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన శాస్త్రీయ రోడ్డు నిర్వహణ వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యమని మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురే్‌షకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - May 21 , 2026 | 04:09 AM