సాస్కీ నిధులతో 37 డిగ్రీ కాలేజీలు
ABN , Publish Date - Aug 20 , 2026 | 04:33 AM
రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంత భవనాలు కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడిగిన..
రాష్ట్రంలో మూడుచోట్ల లైబ్రరీలు: మంత్రి లోకేశ్
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంత భవనాలు కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఒక్కో డిగ్రీ కాలేజీ నిర్మాణంతో పాటు అన్ని హంగులు కల్పించడానికి రూ.15 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. సాస్కి స్కీమ్ ద్వారా కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తామని, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో జోనల్ స్థాయిలో లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అమరావతిలో అద్భుతమైన లైబ్రరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, విశాఖ, రాయలసీమలో కూడా గ్రంథాలయాలు నిర్మిస్తామని లోకేశ్ పేర్కొన్నారు.