హెర్బల్ కాస్మెటిక్స్ హబ్‌గా ఏపీ
ABN , Publish Date - Sep 28 , 2026 | 04:05 AM
రాష్ట్రంలో ఆయుర్వేద, హెర్బల్ కాస్మెటిక్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించి.. ఏపీని దేశంలోనే ప్రముఖ హెర్బల్ కాస్మెటిక్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎంఎ్‌సఎంఈ టెక్నికల్ అడ్వైజరీ డాక్టర్ శంకర్ ప్రసాద్ అన్నారు.
రాష్ట్రంలో తయారైన ఉత్పత్తులను ప్రపంచ
దేశాలకు పరిచయం చేయడమే లక్ష్యం
ఏపీ ఆయుర్వేద డాక్టర్స్ కో-ఆపరేటివ్
సొసైటీ సమావేశంలో వక్తల వెల్లడి
విజయవాడ, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆయుర్వేద, హెర్బల్ కాస్మెటిక్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించి.. ఏపీని దేశంలోనే ప్రముఖ హెర్బల్ కాస్మెటిక్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎంఎ్‌సఎంఈ టెక్నికల్ అడ్వైజరీ డాక్టర్ శంకర్ ప్రసాద్ అన్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో ఆదివారం ఏపీ ఆయుర్వేద డాక్టర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ ఆయుర్వేద వైద్యుల సమావేశం జరిగింది. శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేకంగా హెర్బల్ కాస్మెటిక్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభు త్వ అనుమతులు త్వరగా లభించేలా కూటమి ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో ఉత్పత్తులను తయారు చేసి, రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావడమే సొసైటీ లక్ష్యమన్నారు. ప్రముఖ ఆయుర్వేద వ్యాపారవేత్త సీహెచ్ రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తయారైన ఆయుర్వేద, హెర్బల్ కాస్మెటిక్స్‌ను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడమే లక్ష్యమన్నారు. సమావేశంలో సుమారు 100 మంది ఆయుర్వేద వైద్యులు పాల్గొన్నారు.