రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్‌గా రూపొందిస్తాం
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:55 AM
రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్‌గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు...
రాష్ట్రస్థాయి కోకో కాంక్లేవ్‌లో మంత్రి అచ్చెన్నాయుడు
ఏలూరు సిటీ, జనవరి 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్‌గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కోకో కాంక్లేవ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. కోకో రైతులకు అధికాదాయం ఇచ్చే పంటగా అభివృద్ధి చెందుతోందని, కోకో సాగు విస్తరణ, నాణ్యతా ప్రమాణాలు, ఆఽధునిక సాగు విధానాలపై ఈ కాంక్లేవ్‌లో విస్తృత చర్చ జరుగుతుందని తెలిపారు. కోకో ప్రొసెసింగ్, విలువ జోడింపు ద్వారా రైతులకు మరింత లాభాలు సాధ్యమవుతాయని వెల్లడించారు. కోకో ఉత్పత్తి, నాణ్యత పెంపుతో పాటు అంతర్జాతీయ మార్కెటింగ్‌కు అనుసంధానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీని ఏర్పాటుచేసి పుడ్ ప్రొసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం గత బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించి గత ఏడాది రూ.1200 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకంలో రైతులకు అందిందని చెప్పారు.