Share News

కృష్ణా మిగులు జలాలన్నీ ఏపీవే!

ABN , Publish Date - Jul 08 , 2026 | 04:08 AM

కృష్ణా నదిలో మిగులు జలాలన్నీ దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతాయని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని..

కృష్ణా మిగులు జలాలన్నీ ఏపీవే!

  • బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌కు ఇదే స్పష్టం చేద్దాం

  • అధికారులతో జైదీప్‌ గుప్తా బృందం కసరత్తు

అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదిలో మిగులు జలాలన్నీ దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతాయని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఈ నెల 22 నుంచి జరిగే బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ విచారణలో మరోసారి స్పష్టం చేయాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు జైదీప్‌ గుప్తా, జి.ఉమాపతి ఆధ్వర్యంలో అడ్వకేట్‌ గుంటూరు ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట జలవివాదాల విభాగం ఎస్‌ఈ రాజేశ్వరి తదితరులు మంగళవారం కూడా విజయవాడలో తమ కసరత్తు కొనసాగించారు.

Updated Date - Jul 08 , 2026 | 04:09 AM