ఎయిడెడ్ టీచర్ల సీనియారిటీ జాబితా రూపొందించాలి
ABN , Publish Date - May 04 , 2026 | 04:59 AM
ఎయిడెడ్ టీచర్లకు సీనియారిటీ జాబితా రూపొందించి, కౌన్సెలింగ్ ద్వారా ఒక్కరే టీచర్ ఉన్న పాఠశాలలకు బదిలీ చేయాలని ఏపీ టీచర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది.
అమరావతి, మే 3 (ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్ టీచర్లకు సీనియారిటీ జాబితా రూపొందించి, కౌన్సెలింగ్ ద్వారా ఒక్కరే టీచర్ ఉన్న పాఠశాలలకు బదిలీ చేయాలని ఏపీ టీచర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. గిల్డ్ ప్రతినిధులు బి.చిట్టిబాబు, ఎల్.కె.చిన్నప్ప, ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 205 ఎయిడెడ్ పాఠశాలల్లో ఒక్కొక్కరు చొప్పున మాత్రమే టీచర్లు ఉన్నారని తెలిపారు. మరణించిన టీచర్ల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, భాషా టీచర్లకు పదోన్నతులు కల్పించాలని కోరారు.