చలో ఢిల్లీని విజయవంతం చేయండి: ఏపీటీఎఫ్
ABN , Publish Date - Feb 04 , 2026 | 04:30 AM
ఇన్ సర్వీసు టీచర్ల టెట్ మినహాయింపునకు ఉపాధ్యాయ సంఘాల అఖిల భారత జేఏసీ (ఏఐజేఏసీటీవో) గురువారం నిర్వహిస్తున్న...
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఇన్ సర్వీసు టీచర్ల టెట్ మినహాయింపునకు ఉపాధ్యాయ సంఘాల అఖిల భారత జేఏసీ (ఏఐజేఏసీటీవో) గురువారం నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి కోరారు. సుదీర్ఘ అనుభవం సంపాదించిన టీచర్లకు ఇప్పుడు టెట్ పెట్టడం అసంబద్ధమన్నారు. టీచర్లకు టెట్ మినహాయిస్తూ పార్లమెంటులో సవరణబిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.