సమస్యలపై దశలవారీ పోరాటం: ఏపీటీఎఫ్
ABN , Publish Date - Feb 20 , 2026 | 04:38 AM
ఆర్థిక, విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఏపీటీఎఫ్ నిర్ణయించింది.
అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక, విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఏపీటీఎఫ్ నిర్ణయించింది. గురువారం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పిస్తామని, మార్చి 3న జిల్లా కేంద్రాల్లో మహా ధర్నాలు చేస్తామని తెలిపారు. సీఎస్ కె.విజయానంద్‌కు నోటీసు అందించామన్నారు. 12వ పీఆర్‌సీని నియమించాలని, 30 శాతం ఐఆర్ ఇవ్వాలని, ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాల బకాయిలు చెల్లించాలని, టీచర్లకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుచేయాల ని తదితర డిమాండ్లతో ఈ ఆందోళనలను చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి వివరించారు.