Share News

జీవో 23ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి

ABN , Publish Date - Mar 22 , 2026 | 03:54 AM

మోడల్‌ స్కూల్స్‌ రెగ్యులర్‌ ఉపాధ్యాయులకు సర్వీస్‌ రూల్స్‌ రూపొందించి, వారి సర్వీసులను విద్యాశాఖలో విలీనం చేయాలని, జీవో నంబర్‌ 23ను పూర్తిస్థాయిలో అమలుచేయాలని...

జీవో 23ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి

  • స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌

విజయవాడ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): మోడల్‌ స్కూల్స్‌ రెగ్యులర్‌ ఉపాధ్యాయులకు సర్వీస్‌ రూల్స్‌ రూపొందించి, వారి సర్వీసులను విద్యాశాఖలో విలీనం చేయాలని, జీవో నంబర్‌ 23ను పూర్తిస్థాయిలో అమలుచేయాలని స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఏపీఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు ప్రభుత్వాన్ని డిమాం డ్‌ చేశారు. శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మోడల్‌ స్కూల్స్‌ పై విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు 2019లో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం జీవో 23ను జారీ చేసిందన్నారు. ఈ జీవో రద్దు, సవరణలు చేయాలనే ప్రతిపాదన ఇటీవల రావడంతో మోడల్‌ స్కూల్స్‌ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. దీనిని ఏపీఎస్టీఏ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, జీవో 23ను రద్దుచేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేసింది.

Updated Date - Mar 22 , 2026 | 03:55 AM