విద్యార్థిని విమాన విహారం
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:38 AM
పదో తరగతిలో 500 మార్కులు వస్తే విమానం ఎక్కిస్తానన్నారు ఆ టీచర్. పట్టుదలతో చదివిన ఆ విద్యార్థిని 510 మార్కులు సాధించింది.
ఉపాధ్యాయుడి వినూత్న కానుక
ఏలూరు రూరల్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో 500 మార్కులు వస్తే విమానం ఎక్కిస్తానన్నారు ఆ టీచర్. పట్టుదలతో చదివిన ఆ విద్యార్థిని 510 మార్కులు సాధించింది. ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యాయుడు ఆ విద్యార్థినిని విమానం ఎక్కించారు. ఇక్కడ ఆఫర్ ఇచ్చిన టీచర్ నల్ల రామారావు. ఈయన ఏలూరు జిల్లా ప్రత్తికోళ్ళలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు. విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలను పెంపొందించాలనే ఉద్దేశంతో పదో తరగతిలో 500 మార్కులకు పైగా సాధిస్తే విమానం ఎక్కిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల్లో పాఠశాలకు చెందిన ఘంటసాల అక్షయ 510 మార్కులు సాధించింది. దీంతో రామారావు మాస్టారు అక్షయను గన్నవరం నుంచి హైదరాబాద్‌కు ఆదివారం తన ఖర్చులతో విమానంలో తీసుకెళ్లారు.