జూన్ 30 ప్రామాణికంగా టీచర్ల సర్దుబాటు
ABN , Publish Date - Jul 01 , 2026 | 04:47 AM
ఉపాధ్యాయుల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ను సవరించింది. జూన్ నెలాఖరుకు సర్దుబాటు పూర్తి కావాలని..
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ను సవరించింది. జూన్ నెలాఖరుకు సర్దుబాటు పూర్తి కావాలని గత నెల ఆదేశించగా.. పలు కారణాలతో అది ఆగిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు జూలై 1 నుంచి తాజాగా సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించాలని షెడ్యూలు జారీచేసింది. విద్యార్థుల సంఖ్య విషయంలో ప్రామాణిక తేదీని జూన్ 20కు బదులుగా జూన్ 30ను తీసుకోవాలని స్పష్టం చేసింది. తేదీల వారీగా షెడ్యూల్ ప్రకటించింది.