ఉపాధ్యాయుడికి మెమో
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:18 AM
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్ధులతో కల్లంలో వడ్లు ఆరబెట్టించుకున్న ఘటనపై రాష్ట్ర విద్యా శాఖ కమిషనరేట్ స్పందించింది.
విద్యార్థులతో వ్యవసాయ పనులు చేయించిన పర్యవసానం
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై విద్యాశాఖ అధికారులు ఆరా
విజయవాడ, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్ధులతో కల్లంలో వడ్లు ఆరబెట్టించుకున్న ఘటనపై రాష్ట్ర విద్యా శాఖ కమిషనరేట్ స్పందించింది. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘‘వరి కల్లంలో విద్యార్థులతో చాకిరీ’’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన విద్యాశాఖ అధికారులు ఆరా తీశారు. మంగళవారం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు సెలవు కావడంతో బుధవారం సంఘటనపై క్షేత్రస్థాయి విచారణ జరపాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. ఇప్పటికే దీనిపై విచారణ చేసిన డీఈవో చంద్రకళ సదరు ఉపాధ్యాయుడికి మెమో జారీ చేసినట్టు తెలిపారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులను డీఈవో ఫోన్‌లో సంప్రదించినట్టు సమాచారం.