స్టార్ట్‌పలకు ఊతం
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:51 AM
ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, ఎలకా్ట్రనిక్స్, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు.
ఐదేళ్లలో 20 వేలు ఏర్పాటు లక్ష్యం.. స్టార్ట్‌పల ఏర్పాటులో భాగస్వాములవ్వండి
కొరియన్ కంపెనీలకు మంత్రి లోకేశ్ ఆహ్వానం
మరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, ఎలకా్ట్రనిక్స్, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఆయన.. రెండో రోజైన సోమవారం పలువురు పెట్టుబడుదారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వారికి వివరించారు. భారీ పెట్టుబడులతో రావాలని ఆహ్వానించారు. ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు కార్యరూపం దాల్చేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ప్లాంట్‌లను విస్తరించేందుకు చర్చించారు. అలాగే కొరియన్ స్టార్టప్ ఫౌండర్ల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆవిష్కరణల వెన్నెముక రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ నివాదంతో ఐదేళ్లలో 20,000 స్టార్ట్‌పలు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆర్టీఐహెచ్ ప్రధాన కేంద్రం మంగళగిరితో సహా.. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో ప్రాంతీయ కేంద్రాలు పనిచేస్తున్నాయని వివరించారు. టాటా, ఎల్‌అండ్‌టీ, జేఎ్‌సడబ్ల్యు, అదానీ, గ్రీన్‌కో, జీఎంఆర్ వంటి ప్రఖ్యాత సంస్థల సహకారంతో ఆర్టీఐహెచ్‌లను ప్రపంచ స్థాయి వినూత్న ఆవిష్కరణల రూపకల్పన కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఆర్టీఐహెచ్ ఫుల్‌లైఫ్ సైకిల్ ప్రోగ్రామ్ స్పార్క్ (ఆలోచనల రూపకల్పన), క్యాటలిస్ట్ (18 వారాల ఇంక్యుబేషన్), వెలాసిటీ ల్యాబ్‌లలో పాలుపంచుకోవాలని కొరియన్ స్టార్ట్‌పలను ఆహ్వానించారు. ఈ వేదిక ద్వారా ఇప్పటికే 2,500లకు పైగా స్టార్ట్‌పలకు, 5,200కు పైగా పారిశ్రామికవేత్తలకు సహకారం అందించినట్లు చెప్పారు. ఏపీ ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీలో భాగంగా అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా లోకేశ్ వివరించారు. ప్రొటోటైప్, డీప్‌టెక్ గ్రాంట్ల కింద రూ. 22 కోట్ల ఆర్టీఐహెచ్-ఎ్‌సఐడిబీఐ సీడ్ ఫండ్, రూ. 20కోట్ల వరకూ ఏజెఎఫ్ సీడ్ ఈక్విటీ, వర్కింగ్ క్యాపిటల్ కోసం క్రెడిట్-గ్యారెంటీ వంటివి సమకూర్చినట్లు వెల్లడించారు. 150కి పైగా వీసీ/ఏంజెల్ సిండికేషన్ నెట్‌వర్క్ కలిగిన ఆర్టీఐహెచ్ ఇప్పుడు సిడ్బీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన డీప్‌టెక్ ఏంజెల్ ఫండ్‌తో ఏఐ, క్వాంటమ్ వంటి అధునాతన రంగాల్లోని స్టార్ట్‌పలకు మరింత ఊతమిస్తామని చెప్పారు. ఏపీని భారత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాజధానిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు. ఈ దిశగా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామన్నారు.
ఏపీలో ఆర్‌అండ్‌డీ, ఇన్నోవేషన్ సెంటర్లు నెలకొల్పండి
ప్రఖ్యాత పాదరక్షల సంస్థ షూఆల్స్ చైర్మన్ లీ చియాంగ్-గెన్‌తో లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో షూఆల్స్ పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), ఇన్నోవేషన్ సెంటర్ స్థాపించాలని, ఇప్పటికే చేసుకున్న ఒప్పందం మేరకు రాష్ట్రంలో పాదరక్షల తయారీ యూనిట్ పనులు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. రూ. 300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి లభిస్తుందని ఎంఓయూ సందర్భంగా షూఆల్స్ సంస్థ వెల్లడించింది. ఏపీని రిటైల్ హబ్‌గా మార్చాలన్నారు. ఈ సందర్భంగా సంస్థ లీ చియాంగ్-గెన్ మాట్లాడుతూ, మాగ్నెటిక్ థెరపీ, షాక్ అబ్సార్షన్, కూలింగ్ సోల్స్, యాంటీ బ్యాక్టీరియా మెటీరియల్‌తో ఎఫ్‌డీఎ్‌స-సర్టిఫైడ్ మెడికల్ ఫుట్‌వేర్ తయారీలో తమ సంస్థ ప్రత్యేకతను కలిగి ఉందన్నారు. ఏఐ స్మార్ట్ మెడికల్ ఫుట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూలతను వ్యక్తం చేశారు.
మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే హబ్ ఏర్పాటు చేయండి
దక్షిణ కొరియాకు చెందిన జీఎఎన్ ఎపిటాక్సీ, మైక్రో ఎల్‌ఈడీ, పవర్ ఎలకా్ట్రనిక్స్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్-ఈపీఐ కంపెనీ ప్రై.లిమిటెడ్ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్‌చోలతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే హబ్‌ను స్థాపించాలని ఈ సందర్భంగా వారిని లోకేశ్ కోరారు. దక్షిణ కొరియాకు చెందిన ఎలకా్ట్రనిక్స్ షెల్స్ లేబుల్స్, ఐఓటీ అండ్ పవర్ ఎలకా్ట్రనిక్స్ తయారీ సంస్థ షోలమ్ గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్ ఆఫీసర్ జీగాబ్ హాతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. శ్రీసిటీలో రూ. 338 కోట్లతో ఈవీ చార్జర్ పవర్ మూడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలకా్ట్రనిక్స్ యూనిట్ నిర్మిస్తున్నందుకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ డిస్‌ప్లే ఫ్యాబ్‌ను ఏర్పాటు చేయాలని సియోల్ సెమీ కండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యూంగ్‌లీని లోకేశ్ కోరారు.
భారీగా విద్యుత్ పరికరాల అవసరం ఉంది
హ్యోసంగ్ ఇండస్ట్రీని విస్తరించి విద్యుత్తు పరికరాల యూనిట్‌ను శ్రీసిటీలో స్థాపించాలని సంస్థ ప్రెసిడెంట్ యోకోటా తకేషీని లోకేశ్ కోరారు. ఆ సంస్థ ప్రెసిడెంట్ యోకోటా తకేషీతో మంత్రి లోకేశ్ సియోల్‌లో సమావేశమయ్యారు. ఏపీలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం, అవసరాలు, పెరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శ్రీసిటీలో యూనిట్‌ను నెలకొల్పాలని కోరగా,లోకేశ్ ప్రతిపాదనను పరిశీలిస్తామని యోకోటా తెలిపారు.