పొగాకు వేలంలో పాల్గొనని కంపెనీలపై చర్యలు: అచ్చెన్న
ABN , Publish Date - Jul 08 , 2026 | 05:19 AM
పొగాకు వేలంలో పాల్గొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కంపెనీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పొగాకు బోర్డు అధికారులను ఆదేశించారు.
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): పొగాకు వేలంలో పాల్గొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కంపెనీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పొగాకు బోర్డు అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విషయమై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, వర్జీనియా పొగాకు కొనుగోళ్ల ప్రక్రియపై సమీక్షించారు. ఈ నెల 9న పొగాకు బోర్డు సంయుక్త కార్యదర్శి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యం లో రైతులు, పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.