ఇకపై వారు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌లు!
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:46 AM
తహసీల్దార్ కార్యాలయాల్లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్‌ల హోదాను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ కోరిక మేరకు...
అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): తహసీల్దార్ కార్యాలయాల్లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్‌ల హోదాను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ కోరిక మేరకు వారి హోదాను జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (జేవోఏ)గా మార్పునకు ఆర్ధికశాఖ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి జీవో 8లో సవరణ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హోదా మార్పుపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. వీరి హోదాను జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌గా మార్చాలని రెవన్యూ శాఖ గతేడాది డిసెంబరు 10న ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించింది.