రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లు: హౌసింగ్ బోర్డు చైర్మన్
ABN , Publish Date - May 11 , 2026 | 04:42 AM
రాష్ట్రంలో అర్హులైన వారందరికీ 2028 డిసెంబరు నాటికి ఇళ్లు మంజూరుచేస్తామని రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు తెలిపారు.
బుచ్చెయ్యపేట (అనకాపల్లి జిల్లా), మే 10 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో అర్హులైన వారందరికీ 2028 డిసెంబరు నాటికి ఇళ్లు మంజూరుచేస్తామని రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 23 నెలల కాలంలో 5.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, ఆగస్టులోగా 2.5 లక్షల ఇళ్లు పూర్తిచేస్తామన్నారు.