AP Govt: రాష్ట్ర కార్యక్రమాలుగా 24 మంది జయంతి, వర్ధంతులు!
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:38 AM
రాష్ట్రంలోని 24 మంది ప్రముఖుల జయంతి, వర్ధంతులను రాష్ట్ర కార్యక్రమాలుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 24 మంది ప్రముఖుల జయంతి, వర్ధంతులను రాష్ట్ర కార్యక్రమాలుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ‘వడ్డె ఓబన్న జయంతి జనవరి 11, త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి జనవరి 15, యోగి వేమన జయంతి జనవరి 19, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం, దామోదర సంజీవయ్య జయంతి ఫిబ్రవరి 14, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి ఫిబ్రవరి 22, మొల్లమాంబ (మొల్ల) జయంతి మార్చి 13, పొట్టిశ్రీరాములు జయంతి మార్చి 16, పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి మార్చి 28, బాబూజగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 5, జ్యోతిబా ఫూలే జయంతి ఏప్రిల్ 11, అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14, మహాత్మా బసవేశ్వర జయంతి, అల్లూరి వర్ధంతి మే 7, ఎన్టీఆర్ జయంతి మే 28, అల్లూరి జయంతి జూలై 4, బళ్లారి రాఘవాచార్యులు జయంతి ఆగస్టు 2, సర్ధార్ గౌతు లచ్చన్న జయంతి ఆగస్టు 16, టంగుటూరి ప్రకాశం జయంతి ఆగస్టు 23, భగవాన్ విశ్వకర్మ జయంతి సెప్టెంబరు 17, మహర్షి వాల్మీకి జయంతి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నవంబరు 11, కనకదాస్ జయంతి, పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబరు 15’ నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.