టెన్త్ సప్లిమెంటరీలో 82.39 శాతం ఉత్తీర్ణత
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:58 AM
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 82.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 94,990 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 78,261 మంది ఉత్తీర్ణులయ్యారు.
టాప్‌లో ప్రకాశం... లాస్ట్‌లో ఎన్టీఆర్
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 82.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 94,990 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 78,261 మంది ఉత్తీర్ణులయ్యారు. మంత్రి లోకేశ్ శుక్రవారం ఎక్స్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 4.93 శాతం అదనంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో ప్రకాశం జిల్లా 97.96 శాతం ఉత్తీర్ణతతో టాప్‌లో ఉండగా, ఎన్టీఆర్ జిల్లా 63.18 శాతంతో చివరన నిలిచింది. శనివారం నుంచి 26వ తేదీ వరకూ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టుకు రీకౌంటింగ్‌కు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.వెయ్యి చెల్లించాలి.