Share News

హిందీలో 2.. ఇంగ్లీష్ లో 5

ABN , Publish Date - Apr 04 , 2026 | 03:34 AM

పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు దొర్లిన ప్రశ్నలకు మార్కులు కలపాలని ఎస్‌ఎ్‌ససీ బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది.

హిందీలో 2.. ఇంగ్లీష్ లో 5

  • పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు దొర్లిన ప్రశ్నలకు మార్కుల యాడింగ్‌

  • ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రాథమిక నిర్ణయం

అమరావతి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు దొర్లిన ప్రశ్నలకు మార్కులు కలపాలని ఎస్‌ఎ్‌ససీ బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. హిందీ పరీక్షలో రెండు సరైన సమాధానాలు వచ్చిన ఓ ప్రశ్నకు రెండు మార్కులు కలపాలని, ఇంగ్లిష్‌ పరీక్షలో రెండు సరైన సమాధానాలు వచ్చిన మరో 5 మార్కుల ప్రశ్నకు ఐదు మార్కులు కలపాలని నిర్ణయించింది. అయితే ఈ మార్కులు కలిపే విధానం ఎలా ఉంటుందనే విషయాన్ని నేడు బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. అలాగే ఇంగ్లిష్‌ పరీక్షలో వర్క్‌ బుక్‌ నుంచి వచ్చిన 28వ ప్రశ్నకు కూడా మార్కులు కలపాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. కాగా, ఐదు ప్రశ్నలకు మార్కులు కలపాలని పేరెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శిఖరం నరహరి డిమాండ్‌ చేశారు. పాఠ్యపుస్తకాల్లో లేని, పిల్లల్ని గందరగోళపరిచేలా ప్రశ్నలు ఇచ్చారని ఆయన అన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 03:37 AM