‘మనమిత్ర’లో రీవెరిఫికేషన్ జవాబుపత్రాలు
ABN , Publish Date - May 03 , 2026 | 04:39 AM
పదో తరగతి రీవెరిఫికేషన్ జవాబుపత్రాలను ఇక నుంచి మనమిత్ర (వాట్సాప్ గవర్నెన్స్)లోనూ అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం..
డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు
అమరావతి, మే 2 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి రీవెరిఫికేషన్ జవాబుపత్రాలను ఇక నుంచి మనమిత్ర (వాట్సాప్ గవర్నెన్స్)లోనూ అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మనమిత్ర ద్వారా స్కానింగ్ చేసిన జవాబు పత్రాలను విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. అలాగే ఎప్పటిలాగే స్కూల్ లాగిన్లలోనూ అందుబాటులో ఉంటాయన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈ నెల 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒక సబ్జెక్టుకు రీకౌంటింగ్‌కు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.వెయ్యి చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.