24న పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:58 AM
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని పంచాయతీరాజ్...
అమరావతి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అడిషనల్ కమిషనర్ సుధాకర్‌రావు ఆదేశాలిచ్చారు. మండల, జిల్లా, గ్రామ స్థాయిలో తగిన విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈఓలు, డీపీఓలకు ఆదేశాలిచ్చారు. ముందుగానే సమాచారమిచ్చి అన్ని శాఖలు, ప్రజలు గ్రామ సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.