Share News

హరివంశ్‌ సింగ్‌కు స్పీకర్‌ అయ్యన్న అభినందనలు

ABN , Publish Date - Apr 19 , 2026 | 05:04 AM

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అభినందనలు తెలియజేశారు.

హరివంశ్‌ సింగ్‌కు స్పీకర్‌ అయ్యన్న అభినందనలు

అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక లేఖ రాశారు. రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్‌ కావడంతో పాటు, డిప్యూటీ చైర్మన్‌గా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హరివంశ్‌ సింగ్‌ నాయకత్వం, అనుభవం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఈ ఎన్నిక ఒక నిదర్శనమని అయ్యన్న పేర్కొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 05:06 AM