15 శాతం వృద్ధి లక్ష్యం!
ABN , Publish Date - Jun 23 , 2026 | 04:40 AM
స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో భాగంగా 15శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు వెల్లడి
స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ
పది సూత్రాల అమలుకు వర్కింగ్ గ్రూపుల ఏర్పాటు
అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో భాగంగా 15శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2014-19 మధ్య 13.5 శాతం మేర సీఏజీఆర్ సాధించామని, వివిధ కారణాల వల్ల ప్రస్తుతం 11శాతం వృద్ధిరేటు నమోదైందని తెలిపారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రణాళిక విభాగం, కేఆర్‌ఈఏ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ సంస్థ మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. స్వర్ణాంధ్ర-2047 విజన్ లక్ష్యాల సాధనలో పది సూత్రాల అమలుపై ఈ ఎంవోయూ కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఎ్‌ఫఎంఆర్ సంస్థ ప్రతినిధి కపిల్ విశ్వనాథన్ ఒప్పందాలు మార్చుకున్నారు. పది సూత్రాల అమలుపై రాష్ట్ర స్థాయి కమిటీతోపాటు మిషన్ వర్కింగ్ గ్రూపులను కూడా ఏర్పాటు చేయనున్నారు. వివిధ రంగాల అభివృద్ధికి డీప్ టెక్‌ను ఇంటిగ్రేషన్ చేస్తున్నామని సీఎం వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల తదితరులు పాల్గొన్నారు.