Share News

ఫైల్స్‌ చకచకా!

ABN , Publish Date - Jul 15 , 2026 | 04:22 AM

రాష్ట్రంలో ఫైల్స్‌ క్లియరెన్స్‌లో వేగం పెరిగింది. సీఎస్‌ నుంచి హెచ్‌వోడీల వరకూ ప్రతి ఒక్కరూ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యమైనవి మినహా కొన్ని ఫైళ్లను గంటల వ్యవధిలోనే క్లియర్‌ చేస్తున్నారు.

ఫైల్స్‌ చకచకా!

  • 24 గంటల్లోపే క్లియరెన్స్‌ ఇస్తున్న సెక్రటరీలు

  • టాప్‌లో జీఏడీ స్పెషల్‌ సీఎస్‌ రావత్‌.. 7-10 గంటల్లోనే క్లియరెన్స్‌

అమరావతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఫైల్స్‌ క్లియరెన్స్‌లో వేగం పెరిగింది. సీఎస్‌ నుంచి హెచ్‌వోడీల వరకూ ప్రతి ఒక్కరూ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యమైనవి మినహా కొన్ని ఫైళ్లను గంటల వ్యవధిలోనే క్లియర్‌ చేస్తున్నారు. ఈ విషయంలో సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్.రావత్‌ టాప్‌లో ఉన్నారు. ఆయన సర్వీసెస్‌ అండ్‌ హెచ్‌ఆర్‌కు సంబంధించిన ఫైళ్లను ఏడు గంటల్లోనే క్లియర్‌ చేస్తుండగా... జీఏడీలో జీపీఎం అండ్‌ ఏఆర్‌ విభాగం ఫైళ్లను 10 గంటల్లో పంపించేస్తున్నారు. తర్వాతి స్థానంలో పర్యాటక, హౌసింగ్‌ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌ ఉన్నారు. ఆయన పర్యాటక శాఖలోని ఫైల్స్‌కు 10 గంటల్లో, హౌసింగ్‌లోని ఫైల్స్‌కు 12 గంటల్లో క్లియరెన్స్‌ ఇస్తున్నారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీయూ్‌షకుమార్‌ ఆర్థిక, కమర్షియల్‌ టాక్స్‌ విభాగాల్లోని ఫైళ్లను సగటున 10 నుంచి 13 గంటల్లో క్లియర్‌ చేస్తూ మూడో స్థానంలో నిలిచారు. ముఖేశ్‌ కుమార్‌ మీనా, ఎంటీ కృష్ణబాబు 14 గంటలు, కాంతిలాల్‌ దండే 15 గంటలు, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ 20 గంటలు, బుడితి రాజశేఖర్‌ 21 గంటల్లో ఫైల్స్‌ క్లియర్‌ చేస్తున్నారు. ఎక్కువ మంది సెక్రటరీలు 24 గంటల్లోపు, మిగిలిన వారు 24 నుంచి 30 గంటల్లోపు వారి వద్ద ఉన్న ఫైల్స్‌ను క్లియర్‌ చేస్తున్నారు.


క్షేత్ర స్థాయి పర్యటనల్లో అట్టడుగున దేవదాయ శాఖ..

క్షేత్రస్థాయి పర్యటనలకు సంబంధించి అధికారులు సీఎం ముందు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దేవదాయ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ 16.67ుతో అట్టడుగున ఉన్నారు. ఆయన 6 క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి ఉండగా ఒకే ఒక్కసారి వెళ్లారు. దేవదాయ సెక్రటరీ హరిజవహల్‌లాల్‌, లా సెక్రటరీ ప్రతిభా దేవీ కనీసం 3 పర్యటనలు చేయాల్సి ఉండగా ఒక్కటితోనే సరిపెట్టారు. సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆరు సార్లు వెళ్లాల్సి ఉండగా 10 సార్లు ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు నిర్వహించి టాప్‌లో ఉన్నారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ అంబేడ్కర్‌, ఎంప్లాయ్‌మెంట్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌ గణేశ్‌ కుమార్‌, బీసీ వెల్ఫేర్‌ సెక్రటరీ సత్యనారాయణ ఫీల్డ్‌ విజిట్స్‌లో ముందున్నారు.

Updated Date - Jul 15 , 2026 | 04:24 AM